త్వరలో నటి మధుబాల ఇంట పెళ్లి బాజాలు

Madhubala daughter wedding bells to ring soon in the actress house
  • త్వరలో తన పెద్ద కుమార్తెకు వివాహం జరగనుందని తెలిపిన మధుబాల
  • ప్రస్తుతం తన కూతురు పూర్తిగా పెళ్లి పనుల్లో నిమగ్నమైందని వెల్లడి
  • చిన్న కుమార్తె వ్యాపార రంగం వైపు అడుగులేస్తోందని స్పష్టం
సీనియర్ నటి, 'రోజా' ఫేమ్ మధుబాల తన అభిమానులతో ఒక శుభవార్తను పంచుకున్నారు. తన పెద్ద కుమార్తె త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు.

"నా పెద్ద కుమార్తెకు త్వరలో వివాహం జరగనుంది. ప్రస్తుతం తను పూర్తిగా వివాహ వేడుక ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. వృత్తిపరమైన విషయాల గురించి ఆలోచించకుండా, ప్రస్తుత సమయాన్ని ఆస్వాదిస్తోంది" అని మధుబాల సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా తన వ్యక్తిగత, కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచే మధుబాల, కుమార్తె పెళ్లి వార్తను స్వయంగా వెల్లడించడం విశేషం.

ఇదే క్రమంలో తన చిన్న కుమార్తె కెరీర్ గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మొదట్లో నటనపై ఆసక్తి చూపినప్పటికీ, ఆ తర్వాత వ్యాపార రంగం వైపు మొగ్గు చూపిందని, ప్రస్తుతం తన తండ్రి వ్యాపారంలోనే ఇంటర్న్‌గా పని చేస్తోందని వివరించారు. మధుబాల 1999లో వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకున్నారు. వీరికి అమేయా, కెయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆనంద్ షా... ప్రముఖ వ్యాపారవేత్త జై మెహతాకు కజిన్ బ్రదర్. జై మెహతా అలనాటి అందాల నటి జూహీచావ్లాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. 
Advertisement
Madhubala
Madhubala daughter wedding
Roja actress Madhubala
Ameya Shah marriage
Madhubala family news

More Telugu News