ఓటీటీలోకి వస్తున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!

Satyadev Rao Bahadur movie set for Netflix premiere on July 31
  • ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న సత్యదేవ్ చిత్రం
  • జులై 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న 'రావు బహదూర్'
  • థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకున్న చిత్రం

టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ కుమార్ డి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ సోషల్ డ్రామా 'రావు బహదూర్' డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది.


థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా వైవిధ్యమైన కథాంశం, సత్యదేవ్ బలమైన నటన, సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంది. సత్యదేవ్ ప్రదర్శించిన నటన, దర్శకుడు మలిచిన ఉత్కంఠభరితమైన కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి వస్తుండటంతో ఈ సినిమా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కోబోతోంది.

Advertisement
Satyadev
Rao Bahadur
Netflix
GMB Entertainments
Rao Bahadur OTT Release Date
Prashanth Kumar D

More Telugu News