జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం.. అభిమానుల్లో ఆందోళన

Junior NTR injured his shoulder
  • ఆరు నుంచి ఎనిమిది వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
  • ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని ప్రకటన
  • ఎన్టీఆర్‌కు తగిన వైద్యం అందుతోందన్న వైద్యులు
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా, ఆయనకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు వైద్యుల బృందం సోమవారం ఒక అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇటీవలే బాలకృష్ణ షూటింగ్ లో గాయపడగా, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గాయపడడంతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

కాగా, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ శరీర పరిస్థితిని, గాయం తీవ్రతను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, భుజం కండరాలు మరియు ఎముకలు పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి తప్పనిసరని వైద్యులు వెల్లడించారు. ఫలితంగా, ఆయన దాదాపు రెండు నెలల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండి, విశ్రాంతికే పరిమితం కానున్నారు.

అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎన్టీఆర్‌కు మెరుగైన వైద్యం అందుతోందని వైద్యులు భరోసా ఇచ్చారు. మరోవైపు, గాయం విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
Advertisement
Junior NTR
Jr NTR shoulder injury
Jr NTR health update
NTR medical bulletin
Jr NTR rest period

More Telugu News