‘మీ నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’.. విజయ్‌కు అనిరుధ్ భావోద్వేగ సందేశం
- 5 సినిమాల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న సంగీత దర్శకుడు
- కలిసి పనిచేయడం అదృష్టమని వ్యాఖ్య
- జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయంటూ ఎమోషనల్ పోస్ట్
- వీరిద్దరి కాంబినేషన్‌లో చివరి చిత్రంగా ‘జన నాయగన్’
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌కు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘జన నాయగన్’తో పాటు ‘లియో’, ‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘కత్తి’ చిత్రాల్లో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశాడు. ఈ ప్రయాణం తనకు ఎంతో మధురమైనదని, భావోద్వేగాలతో నిండినదని పేర్కొన్నాడు.
‘‘మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాపై మీరు ఉంచిన అపారమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేను. మన సంగీతం ఎప్పటికీ జీవిస్తుంది’’ అని అనిరుధ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నాడు.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం ‘జన నాయగన్’. ఇది విజయ్ నటించిన చివరి సినిమా కూడా. ఇందులో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజూ కీలక పాత్రలు పోషించారు. తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’కి ఇది రీమేక్‌గా తెరకెక్కింది.