పాత ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ షాక్.. మార్ష్‌మెలో వెర్షన్‌కు సపోర్ట్ బంద్!
- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెలో వెర్షన్‌కు గూగుల్ ప్లే సర్వీసెస్ సపోర్ట్ నిలిపివేత
- ఇకపై కనీసం ఆండ్రాయిడ్ 7.0 నూగట్ వెర్షన్ తప్పనిసరి
- పాత ఫోన్లలో యాప్స్, నోటిఫికేషన్ల పనితీరుపై క్రమంగా ప్రభావం
- ఆగిపోనున్న సెక్యూరిటీ అప్‌డేట్స్
టెక్ దిగ్గజం గూగుల్ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 11 ఏళ్ల క్రితం విడుదలైన ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెలో ఆపరేటింగ్ సిస్టమ్‌కు గూగుల్ ప్లే సర్వీసెస్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్లే సర్వీసెస్ అప్‌డేట్స్ పొందాలంటే, సంబంధిత పరికరాల్లో కనీసం ఆండ్రాయిడ్ 7.0 నూగట్ లేదా అంతకంటే పై వెర్షన్ ఉండటం తప్పనిసరి. గూగుల్ తన సపోర్ట్ పేజీలో ఈ విషయాన్ని అప్‌డేట్ చేసింది.
గూగుల్ ప్లే సర్వీసెస్ అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఇది స్మార్ట్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే అత్యంత కీలకమైన సిస్టమ్ కాంపోనెంట్. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వడం, యాప్స్ నోటిఫికేషన్లు, లొకేషన్ సేవలు, డేటా సింక్రోనైజేషన్ వంటి అనేక ముఖ్యమైన ఫీచర్లు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. చాలా థర్డ్-పార్టీ యాప్స్‌లు సక్రమంగా పనిచేయాలన్నా గూగుల్ ప్లే సర్వీసెస్ తోడ్పాటు అత్యవసరం.
ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెలో వెర్షన్‌పై నడిచే ఫోన్లు ఈ మార్పు వల్ల తక్షణమే పనిచేయడం ఆగిపోవు. కాలింగ్, టెక్స్టింగ్ వంటి ప్రాథమిక ఫీచర్లు, ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌లు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, రానున్న రోజుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లే సర్వీసెస్‌పై ఆధారపడే యాప్స్‌లు మొరాయించడం, కొత్త యాప్స్‌లను డౌన్‌లోడ్ చేయలేకపోవడం, సిస్టమ్ అప్‌డేట్స్ ఆగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, భద్రతాపరమైన లోపాలను సరిదిద్దే సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు ఇకపై ఈ డివైజ్‌లకు అందవు.
2015లో మార్కెట్లోకి వచ్చిన ఆండ్రాయిడ్ మార్ష్‌మెలోకు గూగుల్ సుదీర్ఘకాలం పాటు సపోర్ట్ అందించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వెర్షన్‌ను వినియోగిస్తున్న వారు కేవలం 0.4 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. యూజర్ బేస్ గణనీయంగా తగ్గిన పాత వెర్షన్లకు సపోర్ట్ నిలిపివేయడం గూగుల్‌కు సాధారణ ప్రక్రియే. మీ ఫోన్ ఏ వెర్షన్‌పై పనిచేస్తుందో తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లోని 'అబౌట్ ఫోన్' ఆప్షన్‌ను తనిఖీ చేయవచ్చు.