- రాప్తాడులో క్లాస్‌రూమ్‌లో విద్యార్థినిపై రంపంతో దాడి
- ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన పరిటాల సునీత
- ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే విద్యుత్ రంపంతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "రాప్తాడు స్కూల్లో చిన్నారిపై జరిగిన కిరాతక దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. నిందితుడిని పట్టుకుని అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించాను" అని ఆయన తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఉదయం తరగతి గదిలో పాఠం జరుగుతుండగా నిందితుడు లోపలికి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.