Advertisement

‘భయపడేవాడు చనిపోయినట్టే’.. అర్ధరాత్రి జిమ్ ఫొటోలతో ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ కౌంటర్!

Salman Khan counters trolls with midnight gym photos saying he who is afraid is dead
  • అర్ధరాత్రి జిమ్ ఫొటోలు షేర్ చేసిన సల్మాన్
  • చొక్కా లేకుండా సిక్స్‌ప్యాక్ ప్రదర్శన
  • ఇటీవల ఆయన లుక్స్‌, ఆరోగ్యంపై ట్రోల్స్‌
  • వాటికి తాజాగా పరోక్షంగా గట్టి కౌంటర్
  • సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల తన లుక్స్‌, ఆరోగ్యంపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇస్తూ అర్ధరాత్రి జిమ్‌లో దిగిన రెండు షర్ట్‌లెస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వర్కౌట్ అనంతరం తీసిన ఈ ఫొటోల్లో సల్మాన్ తన ఫిట్ బాడీ, సిక్స్‌ప్యాక్‌ను ప్రదర్శించారు.

ఈ ఫొటోలకు ‘‘సల్మాన్‌ఖాన్‌ భయపడ్డాడా.. భయపడేవాడు చనిపోయినట్టే’’ అనే డైలాగ్‌తో తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సల్మాన్ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఇంటికి వెళ్లాలని సూచించారు. దీనిపైనా కొంత మంది విమర్శలు గుప్పించారు. దీంతో తాజా పోస్ట్‌ వీటికి కూడా కౌంటర్‌ అయి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ కనిపించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా జిమ్ ఫొటోలతో తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని సల్మాన్ చెప్పకనే చెప్పినట్టయ్యింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ చిత్రంలో నటిస్తున్నారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
Advertisement
Salman Khan
Salman Khan gym photos
Salman Khan fitness
Bollywood news
Matrubhoomi movie
Salman Khan shirtless

More Telugu News