Advertisement

'జన నాయగన్' థియేటర్‌లో మంత్రి హంగామా.. 'A' సర్టిఫికెట్ సినిమాకు పిల్లలతో ప్రత్యక్షం!

Jana Nayagan theater minister commotion appeared with kids for A certificate movie
  • 'జన నాయగన్' వీక్షించిన తమిళనాడు పర్యావరణ మంత్రి రాజీవ్ 
  •  'A' సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పిల్లలతో థియేటర్‌కు రాక 
  •  నిబంధనల ఉల్లంఘనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం 
  •  చట్టాలు అందరికీ సమానమేనంటూ నెటిజన్ల కామెంట్స్ 
  •  థియేటర్ యాజమాన్యాల తీరుపై ప్రశ్నల వర్షం
రాష్ట్రమంతటా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, అభిమానుల కోలాహలం మధ్య ప్రదర్శితమవుతున్న 'జన నాయగన్' చిత్రం చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముసురుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం కావడంతో పాటు, ఆయన నటనకు స్వస్తి పలుకుతూ తీసిన చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గురువారం (జులై 23న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే సినిమా సాధిస్తున్న విజయంతో పాటు, ఒక తమిళనాడు మంత్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రామనాథపురంలోని ఒక థియేటర్‌లో తమిళనాడు పర్యావరణ శాఖ మంత్రి రాజీవ్ తన భార్య, పిల్లలతో కలిసి సాయంత్రం 4 గంటల షోకు విచ్చేశారు. అయితే ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) 'A' (అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ నిబంధనల ప్రకారం 'A' సర్టిఫికెట్ పొందిన సినిమాలకు పిల్లలను అనుమతించకూడదు.

 కానీ, మంత్రి తన చిన్న పిల్లలతో కలిసి థియేటర్‌లోకి వచ్చి సినిమా చూస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలు, నిబంధనలు కేవలం సామాన్యులకేనా, విఐపీలకు వర్తించవా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నప్పటికీ, ఈ 'A' సర్టిఫికెట్ రగడ సినిమా చుట్టూ  దుమారాన్నే రేపుతోంది.
Advertisement
Minister Rajeev
Jana Nayagan
Thalapathy Vijay
A certificate movie controversy
Ramanathapuram
H Vinoth

More Telugu News