హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'NBK111' చిత్ర షూటింగ్‌లో బాలకృష్ణ స్వల్పంగా గాయపడిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు కండరాల గాయం అయిందని తెలిసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన తన పోస్టులో తెలిపారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు సైతం తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని, తిరిగి సెట్స్‌పైకి రావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.