నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది.. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది: నాగార్జున
- లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయంపై 'వైభవం' పేరుతో సక్సెస్ మీట్
- ఇంట్లో పండగ వాతావరణం నెలకొందని చెప్పిన నాగార్జున
- అన్నగా, అభిమానిగా అఖిల్‌ను చూసి గర్వపడుతున్నానన్న నాగ చైతన్య
- కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలిపిన చిత్రబృందం
- డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ సభ్యులకు షీల్డులు అందజేత
అక్కినేని అఖిల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భారీ విజయం 'లెనిన్' రూపంలో వరించింది. ఈ ఆనందాన్ని పంచుకునేందుకు సోమవారం నాడు 'బ్లాక్ బస్టర్ వైభవం' పేరుతో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ విజయం తమ కుటుంబంలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని నాగార్జున భావోద్వేగంతో చెప్పగా, తమ్ముడి విజయాన్ని చూసి ఓ అన్నయ్యగా, అభిమానిగా గర్వపడుతున్నానని నాగ చైతన్య అన్నారు. ఈ వేడుకలో డిస్ట్రిబ్యూటర్లకు, చిత్ర బృందానికి షీల్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. "చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి ఇలా షీల్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని ఫోన్లు వస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు (అభిమానులకు) ఎలా ఉందో తెలీదు కానీ, నాకు, అఖిల్, చైతన్యకు మాత్రం ఇంట్లో పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతోంది. ఈ ప్రేమ కోసం, ఈ అరుపుల కోసమే అఖిల్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రేమను ప్రేక్షకులు, అభిమానులు తిరిగి చూపించారు. రైటర్ సత్యానంద్ గారు ఇచ్చిన ఇన్‌పుట్స్, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కష్టం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. రెండు వారాల ముందే సినిమాను పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇస్తే అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుంది. అందరూ ఈ విషయాన్ని గమనించాలి" అని అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. "తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా, అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు. కథ విన్నప్పుడే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. 'లెనిన్' పాత్రకు, అఖిల్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఆ పాత్ర కోసం తను పూర్తిగా మారిపోయాడు. ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నాన్నగారి ఫైర్ ఎలాంటిదో నాకు, అఖిల్‌కు బాగా తెలుసు. 'శివ', 'అన్నమయ్య', 'నిన్నే పెళ్లాడతా' వంటి చిత్రాలను ఆయన ఎంత డేరింగ్‌గా తీశారో, 'లెనిన్' విషయంలోనూ అదే డేరింగ్ చూపించారు. ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో నిర్మాత నాగవంశీకి బాగా తెలుసు. తమన్ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా బేబీ సిసింద్రీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. "ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా మాట్లాడాం. విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లు పెంచి మాకు మద్దతుగా నిలిచిన డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. కేవలం మూడు రోజుల్లోనే మా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ, మా కోసం వచ్చిన అక్కినేని అభిమానులకు, అన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపారు.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'లెనిన్' చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకుని, విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ వేడుకలో నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళీ కిశోర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.