బిగ్‌బాస్ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో కొత్త సీజన్
- ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు
- షో చరిత్రలోనే అతిపెద్ద వేడుక
- తెలుగులో వ్యాఖ్యాతగా నాగార్జున
- ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్
బిగ్‌బాస్ అభిమానులకు జియోస్టార్ శుభవార్త చెప్పింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని జియోస్టార్ అధికారికంగా ప్రకటించింది.
హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్, బెంగాలీకి సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ ప్రయాణం, ప్రేక్షకాదరణ, సాంస్కృతిక ప్రభావం, బ్రాండ్‌లకు ఈ షో అందించిన అవకాశాలపై ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో జియోస్టార్ ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను కూడా విడుదల చేసింది.
గత రెండు దశాబ్దాలుగా బిగ్‌బాస్ ప్రతి సీజన్‌తో మరింత ప్రజాదరణ పొందుతోందని జియోస్టార్ ప్రతినిధులు తెలిపారు. ఈసారి ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు ప్రారంభం కావడం షో చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవనుందని పేర్కొన్నారు.