రాస గుమ్మడి... 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో పాటకు ముహూర్తం ఫిక్స్
- వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' నుంచి రెండో సింగిల్ అప్‌డేట్
- 'రాస గుమ్మడి' పేరుతో రానున్న మాస్ సాంగ్
- జూలై 19న లిరికల్ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటన
- రాయలసీమ బీట్స్‌తో ఈ పాట ఉండబోతున్నట్లు వెల్లడి
- ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ 'రాస గుమ్మడి'ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రాయలసీమ బీట్స్‌తో సాగే ఈ మాస్ పాట లిరికల్ వీడియోను జూలై 19న రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట 'కమ్సహమ్నిదా' కొరియన్ ఫ్లేవర్‌తో ఆకట్టుకోగా, ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా రాయలసీమ నేపథ్యంలోని మాస్ సాంగ్‌ను తీసుకురావడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. "కొరియన్ కబుర్లు ముగిశాయి.. ఇప్పుడు రాయలసీమ బీట్స్ సమయం" అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన దక్షా నగార్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.