బెడ్‌షీట్స్, పిల్లో కవర్లు ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి?
- బెడ్‌షీట్స్‌ను వారానికి ఒకసారి ఉతకాలంటున్న నిపుణులు
- పిల్లో కవర్లు 2-3 రోజులకు ఒకసారి ఉతికితే మంచిదని సూచన
- డ్యువెట్ కవర్లు 1-2 వారాలకు ఒకసారి ఉతకాలట
- దుప్పట్లు, కంఫర్టర్లు 2-3 నెలలకు ఒకసారి సరిపోతుందట సూచన
- అలర్జీలు, చెమట ఎక్కువైతే మరింత తరచుగా ఉతకాల్సిందే
రోజంతా అలసిపోయాక మనం ఎక్కువ సమయం గడిపేది మంచంపైనే. కానీ ప్రతి ఉదయం బెడ్‌ను సర్దే అలవాటు ఉన్నా.. బెడ్‌షీట్స్, పిల్లో కవర్లు ఎప్పుడు ఉతకాలి అనే విషయంలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. చెమట, చర్మం నుంచి ఊడిపోయే కణాలు, శరీరం నుంచి వచ్చే సహజ నూనెలు, దుమ్ము, బ్యాక్టీరియా.. ఇలా ఎన్నో క్రమంగా పరుపుపై వేసే వస్త్రాలపై పేరుకుపోతుంటాయి. ఎక్కువ రోజుల పాటు ఉతక్కపోతే అలర్జీలు, మొటిమలు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బెడ్‌షీట్స్ వారానికి ఒకసారి
బెడ్‌షీట్స్‌ను వారానికి కనీసం ఒక్కసారైనా ఉతకడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే చెమట, చర్మ కణాలు, దుమ్ము, అలర్జీ కారకాలు తొలగిపోతాయి. ఎక్కువగా చెమట పట్టే వారు, పెంపుడు జంతువులతో కలిసి నిద్రించే వారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు, దుస్తులు లేకుండా నిద్రించే వారు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఉతకడం మరింత మంచిదని చెబుతున్నారు.
పిల్లో కవర్లు ఇంకా త్వరగా
పిల్లో కవర్లు ముఖం, జుట్టుతో నేరుగా తాకుతుంటాయి. వాటిపై చెమట, జుట్టు నూనె, చర్మ సంరక్షణ ఉత్పత్తుల అవశేషాలు, లాలాజలం పేరుకుపోతాయి. అందుకే రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఉతికితే పరిశుభ్రంగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల మురికి కారణంగా వచ్చే మొటిమల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంది. కనీసం వారానికి ఒక్కసారైనా తప్పకుండా ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు.
మిగతా వస్త్రాలు ఎప్పుడు?
పిల్లో ప్రొటెక్టర్లను నెలకు ఒకసారి ఉతికితే సరిపోతుంది. మరకలు పడినా, ఎక్కువగా మురికిగా కనిపించినా వెంటనే శుభ్రం చేయాలి. డ్యువెట్ కవర్లను ఒకటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఉతకడం మంచిది. కంఫర్టర్లు, క్విల్ట్‌లను రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తే సరిపోతుంది. అయితే మరకలు పడినా, దుర్వాసన వచ్చినా, అనారోగ్యంతో ఉన్నవారు వాడినా ఆలస్యం చేయకుండా ఉతకాలి.
ఈ పరిస్థితుల్లో మరింత జాగ్రత్త
రాత్రిళ్లు ఎక్కువగా చెమట పట్టడం, అలర్జీ లేదా ఆస్తమా ఉండటం, పెంపుడు జంతువులతో కలిసి నిద్రించడం, జలుబు లేదా అంటువ్యాధులతో బాధపడటం, మంచంపైనే భోజనం చేయడం వంటి పరిస్థితుల్లో బెడ్‌పై ఉండే వస్త్రాలను మరింత తరచుగా ఉతకాలని నిపుణులు సూచిస్తున్నారు.