- పని వాయిదా వేయడం ఎప్పుడూ బద్ధకం వల్లే జరగకపోవచ్చంటున్న సైకాలజీ
- వైఫల్య భయం, ఆందోళన, విసుగు కూడా కారణాలు
- పని వాయిదా వేస్తే తాత్కాలికంగా ఉపశమనం
- తర్వాత గడువు ఒత్తిడి, పశ్చాత్తాపం పెరిగే ఛాన్స్
- తరచూ వాయిదా వేయడం మానసిక ఒత్తిడితో సంబంధం
- పనిని చిన్న భాగాలుగా విభజించడం వల్ల ఉపయోగం
చేయాల్సిన పని ఉందని తెలుసు.. గడువు దగ్గరపడుతోందని కూడా తెలుసు. అయినా పని మొదలుపెట్టకుండా ఫోన్ చూస్తూ, సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ, అనవసరమైన పనుల్లో సమయం గడుపుతున్నారా? ‘రేపు ఎలాగైనా పూర్తి చేస్తా’ అని రోజూ అనుకుంటున్నారా? అయితే మీరు బద్ధకస్థులని వెంటనే నిర్ణయించుకోవద్దు. దీని వెనుక మరో కారణం ఉండొచ్చని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పని చేయడానికి బద్ధకం ఒక్కటే కారణం కాదు.. ఆ పని మనలో కలిగించే అసౌకర్యకరమైన భావాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం కూడా కావచ్చని వివరిస్తున్నారు.
అసలు కారణమేంటి?
ఒక ముఖ్యమైన అసైన్మెంట్ పూర్తి చేయాలనుకుందాం. దాన్ని మొదలుపెట్టగానే తప్పులు చేస్తానేమోననే భయం కలగవచ్చు. పని చాలా పెద్దదిగా అనిపించవచ్చు. ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థంకాకపోవచ్చు. మరికొందరికి ఆ పని బోరింగ్‌గా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనసుకు కలిగే అసౌకర్యాన్ని ఎదుర్కోవడం కంటే ఆ పనిని పక్కన పెట్టడం సులభంగా అనిపిస్తుంది.
దాంతో కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది. పని చేయాల్సిన ఒత్తిడి నుంచి తాత్కాలికంగా బయటపడినట్లు అనిపిస్తుంది. కానీ చేయాల్సిన పని మాత్రం అలాగే మిగిలిపోతుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఫుషియా సిరోయిస్, తిమోతి పైచిల్ పరిశోధనల్లో ఈ ప్రవర్తనను తక్షణ మానసిక ఉపశమనం కోసం పని వాయిదా వేయడంగా వివరించారు. అంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల కంటే ప్రస్తుతానికి మనసు ప్రశాంతంగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.
‘రేపు చేసుకోవచ్చులే’.. ఈ ఆలోచనే సమస్య!
పని వాయిదా వేసేవారు రేపు ఎక్కువ సమయం ఉంటుందని, మరింత ఉత్సాహంగా ఉంటామని అనుకుంటారు. కానీ మరుసటి రోజు వచ్చినా పరిస్థితి మారకపోవచ్చు. పైగా గడువు దగ్గరపడటంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఉదాహరణకు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి పాఠాలు చదవాల్సి ఉన్నా ఫోన్ చూస్తూ సమయం గడిపాడనుకుందాం. మొదట్లో చదవకపోవడం వల్ల కలిగే ఆందోళన తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ పరీక్ష దగ్గరపడే కొద్దీ చదవాల్సిన అంశాలు పేరుకుపోతాయి. అప్పుడు ఆందోళనతో పాటు పశ్చాత్తాపం కూడా పెరుగుతుంది. ఇలా పని వాయిదా వేయడం, తర్వాత అపరాధ భావనకు గురికావడం, ఆ భావన నుంచి తప్పించుకోవడానికి మళ్లీ పనిని వాయిదా వేయడం.. ఒక చక్రంలా కొనసాగవచ్చు.
ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
తరచూ పనులు వాయిదా వేయడం వల్ల గడువుల ఒత్తిడి పెరగవచ్చు. పూర్తికాని పనుల గురించి పదేపదే ఆలోచించడం నిద్రపై, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యాన్నీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాయిదా వేయడం, ఆందోళన, ఒత్తిడి మధ్య సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఇదే కారణం ఉంటుందని చెప్పలేం.
పని వాయిదా వేయడం మానాలంటే ఏం చేయాలి?
1. పనిని చిన్న భాగాలుగా విభజించండి: పెద్ద పనిని ఒకేసారి పూర్తి చేయాలనే ఆలోచన ఒత్తిడిని పెంచుతుంది. దాన్ని చిన్న చిన్న దశలుగా విభజించండి.
2. ఐదు నిమిషాలతో మొదలుపెట్టండి: గంటల తరబడి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోకుండా, మొదట ఐదు నిమిషాలు కేటాయించండి. ఉదాహరణకు పుస్తకం తెరిచి ఒక పేజీ చదవడం లేదా డాక్యుమెంట్లో ఒక వాక్యం రాయడం మొదలుపెట్టండి.
3. ఏ భావన మిమ్మల్ని ఆపుతోందో గుర్తించండి: పని కష్టంగా అనిపిస్తోందా? తప్పులు చేస్తాననే భయమా? లేక విసుగుగా ఉందా? కారణం తెలుసుకుంటే దానికి తగిన పరిష్కారం వెతకవచ్చు.
4. మీపై మీరే నిందలు వేసుకోవద్దు: పని వాయిదా వేసినందుకు నిరంతరం బాధపడటం సమస్యను మరింత పెంచవచ్చు. జరిగిన దాన్ని అంగీకరించి, మళ్లీ చిన్న అడుగుతో ప్రారంభించండి.
5. సరైన మూడ్ కోసం ఎదురుచూడకండి: పని చేయాలనే ఉత్సాహం వచ్చినప్పుడే మొదలుపెట్టాలని అనుకుంటే మరింత ఆలస్యం కావచ్చు. చిన్న చర్యతో ప్రారంభించి, క్రమంగా ముందుకు సాగడం మంచిది.