- చదివేటప్పుడు ఫోన్‌ను మరో గదిలో ఉంచితే బెటర్
- అవసరం లేని నోటిఫికేషన్లు ఆఫ్ చేస్తే మేలు
- రోజువారీ చదువు లక్ష్యాలు నిర్ణయించుకుంటే ఉపయోగకరం
- 25 నిమిషాల చదువు, 5 నిమిషాల విరామం పాటించాలని సూచన
- ఫోన్ వాడకానికి నిర్దిష్ట సమయం కేటాయించుకుంటే మేలు
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొబైల్ ఫోన్ పెద్ద ఆటంకంగా మారుతోంది. పుస్తకం ముందు కూర్చున్నా.. ఫోన్‌లో మెసేజ్ వచ్చిందేమోనని చూడటం, సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేయడం, నోటిఫికేషన్లు చెక్ చేయడం అలవాటుగా మారింది. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గడమే కాకుండా, అనుకున్న సమయంలో సిలబస్ పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. అయితే కొన్ని చిన్న మార్పులతో ఫోన్ వాడకాన్ని నియంత్రించి చదువుపై దృష్టి పెట్టవచ్చు.
చదువుకునే సమయంలో ఫోన్‌ను పక్కనే పెట్టుకోకుండా మరో గదిలో ఉంచడం మంచిది. అది సాధ్యం కాకపోతే సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతి కొన్ని నిమిషాలకు ఫోన్ చూసే అలవాటు తగ్గుతుంది.
చదువు ప్రారంభించే ముందు ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులను నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక అధ్యాయం చదవడం, 20 ప్రశ్నలు సాధన చేయడం వంటి చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. లక్ష్యం స్పష్టంగా ఉంటే చదువుపై దృష్టి నిలపడం సులభమవుతుంది.
ఒకేసారి గంటల తరబడి చదవాలని ప్రయత్నించకుండా, 25 నిమిషాలు ఏకాగ్రతతో చదివి ఐదు నిమిషాలు విరామం తీసుకోవచ్చు. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే అలసట తగ్గి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విరామ సమయంలోనూ సోషల్ మీడియా చూడకుండా కాసేపు నడవడం, నీళ్లు తాగడం మంచిది.
చదువుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. టేబుల్‌పై అవసరమైన పుస్తకాలు, నోట్స్ మాత్రమే ఉంచాలి. చదువుతున్న సమయంలో చాటింగ్, వీడియోలు చూడటం వంటి పనులకు దూరంగా ఉండాలి. చదువుకునేటప్పుడు ఫోన్ అవసరమైతే ఇతర యాప్‌లను బ్లాక్ చేసే ఫోకస్ ఫీచర్లు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఫోన్‌ను పూర్తిగా మానేయడం కంటే దాని వినియోగానికి సమయం నిర్ణయించుకోవడం ప్రయోజనకరం. రోజూ ఇదే పద్ధతిని పాటిస్తే ఏకాగ్రత మెరుగుపడటంతో పాటు చదువును ప్రణాళిక ప్రకారం పూర్తి చేసే అవకాశం పెరుగుతుంది.