ప్రశ్నిస్తే చంపేస్తారా? జనసైనికులపై ప్రకాశ్ రాజ్ ఫైర్... వీడియో ఇదిగో!

Prakash Raj slams Janasena activists over YouTuber Prashant Ravan arrest
  • యూట్యూబర్ అరెస్ట్‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
  • జనసేన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
  • జనసేన కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు
  • వారిపై చర్యలు తీసుకోవాలని పవన్, చంద్రబాబులను ట్యాగ్ చేసిన నటుడు
  • యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై వీడియో విడుదల
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, జనసేన పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ ప్రశాంత్ రావణ్ అరెస్టు వ్యవహారంలో జనసైనికులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ, "ప్రశ్నించేవాళ్లను చంపేస్తారా ఏంటి? ఇది గుండాయిజం కాదా?" అని నిలదీశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. జనసేన కార్యకర్తల తీరు రౌడీయిజంలా ఉందని, దీనిపై చర్యలు తీసుకుంటారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో జనసేన కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తున్నారని, పద్ధతిగా మెలగాలని ప్రకాశ్ రాజ్ హితవు పలికారు. కేసును న్యాయస్థానం చూసుకుంటుందని, దేశం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.

పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం ఆయన్ను పిఠాపురానికి తరలించగా, అక్కడ ఒక కేసులో బెయిల్ లభించింది. అయితే, జనసేన కార్యకర్తలు పెట్టిన మరో కేసులో పోలీసులు ఆయన్ను వెంటనే తిరిగి అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను మచిలీపట్నం తరలించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే జనసేన కార్యకర్తల తీరును విమర్శిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Prakash Raj
Janasena Party
Pawan Kalyan
Prashant Ravan arrest
Chandrababu Naidu
Andhra Pradesh politics

More Telugu News