హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత భారీ గృహ నిర్మాణ పథకానికి ఆకర్షణీయమైన పేరును సూచించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. ఈ పథకానికి అత్యుత్తమ పేరును సూచించిన విజేతకు తెలంగాణ గృహనిర్మాణ సంస్థ (టీజీహెచ్‌బీ) రూ. లక్ష నగదు బహుమతిని ప్రకటించింది.

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతంలో లక్ష ఇళ్లను నిర్మించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ భారీ ప్రాజెక్టుకు సముచితమైన పేరును నిర్ణయించే ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని భావిస్తున్నట్లు హౌసింగ్ బోర్డ్ వైస్-ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ సూచనలను tghd.official అనే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా సమర్పించవచ్చు. పేర్లను పంపేందుకు 2026 జూన్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.