92 దేశాలను వెనక్కి నెట్టి అమెరికాలో భారత ఆర్మీ మేజర్ రికార్డు!
- అమెరికా సైనిక కోర్సులో భారత మేజర్ రికార్డు
- 92 దేశాల అధికారులపై ప్రభాత్ విజయం
- లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో 2 టాప్ అవార్డుల సొంతం
- రీసెర్చ్, రైటింగ్ విభాగాల్లో అద్భుత ప్రతిభ
- దేశ రక్షణ రంగానికి గర్వకారణం
ఈ ఏడాది మొత్తం 951 మంది సైనిక అధికారులు ఈ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేశారు. అందులో అమెరికా భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన 120 మంది అంతర్జాతీయ అధికారులు ఉన్నారు. మిలిటరీ స్టడీస్, రీసెర్చ్, లీడర్‌షిప్ రైటింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగానూ మేజర్ ప్రభాత్‌కు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ కోర్సు ముగింపు వేడుకల్లో ఆయనకు ‘బిర్రర్-బ్రూక్స్ అవార్డు’ అందజేశారు. దాంతో పాటు ‘జనరల్ డగ్లస్ మెక్‌ఆర్థర్ మిలిటరీ లీడర్‌షిప్ రైటింగ్ అవార్డు’నూ ఇచ్చారు.
‘మల్టీపోలార్ వరల్డ్’లో భారత సైనిక వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనే అంశంపై ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. అవార్డుల ఎంపికలో ఈ థీసిస్ ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సైనిక విద్యాసంస్థ 1894 నుంచి అంతర్జాతీయ మిలిటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 170 దేశాలకు చెందిన 8,700 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు. మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా చురుకైన, వినూత్నమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.