బండి సంజయ్‌కు భారీ ఊరట.. ఆయనపై ఉన్న పోస్టులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశం

Bandi Sanjay Gets Major Relief Court Orders Removal of Posts
  • కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • కుమారుడి పోక్సో కేసుతో ఆయన పేరును ముడిపెట్టొద్దని ఆదేశం
  • సంబంధిత వీడియోలు, వార్తలను వెంటనే తొలగించాలని స్పష్టీకరణ
  • గూగుల్, మెటా, ఎక్స్‌‌తో పాటు పలు మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు
  • ఉత్తర్వులు పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి, బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.

తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బండి సంజయ్ నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. గూగుల్, మెటా, ఎక్స్ కార్ప్‌‌తో పాటు పలు టీవీ ఛానెళ్లను ప్రతివాదులుగా చేర్చి ఆయన దావా వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని రకాల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.

భవిష్యత్తులో కూడా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరుతో ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని, ప్రచురించరాదని కోర్టు గట్టిగా ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పాటించని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.
 
Go Back to Shorts
Bandi Sanjay
Bandi Sanjay Kumar
Hyderabad City Civil Court
defamation
social media posts
POCSO case
court order
interim orders
Google
Meta
X Corp

More Telugu News