పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి

Harshith Raj Hyderabad student dies of electrocution at IIT Patna
  • క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం
  • మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు
  • తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు
బీహార్ లోని పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నగరంలోని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తించారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లు ఐఐటీ పాట్నా సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ దీపక్ కుమార్ చౌరాసియా నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు.

క్రికెట్ ఆడుతూ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థి తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు ఐఐటీ పాట్నా అధికారులు సమాచారం ఇచ్చారు.
Go Back to Shorts
Harshith Raj
IIT Patna
Hyderabad student death
Electrical shock
Cricket accident
Chandnagar

More Telugu News