హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం

UK Efforts to Open Hormuz Strait Invites India and 40 Nations
  • భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం
  • వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్
  • ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి
  • సమావేశానికి అమెరికా దూరం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సుమారు 40 దేశాలతో చర్చిస్తున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఈ జలసంధిని తెరవడానికి బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆ దేశం పలు దేశాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40 దేశాలను ఆహ్వానించింది.

ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇందులో వర్చువల్‌గా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అమెరికా పాల్గొనడం లేదు.

హర్మూజ్ జలసంధిని తెరవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ స్పందించింది.

భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా 40 దేశాలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నాయి. వచ్చే వారం ఈ సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి బ్రిటన్ విదేశాంగ మంత్రి కూపర్ అధ్యక్షత వహించనున్నారు. ఇరాన్ వైఖరి ప్రపంచ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందని కూపర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Hormuz Strait
UK
Britain
India
Vikram Misri
World Economy
Iran
Maritime Security
Trump

More Telugu News