Pooja Narula: బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చులు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నెలకు రూ.1.43 లక్షలా!

Google Techie Pooja Narulas Monthly Expenses in Bangalore
  • ఆదాయం ఎక్కువే.. ఖర్చులు కూడా ఎక్కువేనన్న టెకీ
  • ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో
  • సామాన్యుడి ఏడాది సంపాదన ఆమె ఒక్క నెల ఖర్చు అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు ఎంత భారీగా ఉంటాయో.. వారి ఖర్చులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. గూగుల్‌లో పనిచేస్తున్న పూజా నరుల అనే 24 ఏళ్ల టెక్కీ ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ఖర్చుల చిట్టాను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఖర్చుల వివరాలు..

పూజ షేర్ చేసిన వివరాల ప్రకారం.. గత నెలలో ఆమె చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ.1.43 లక్షలు. ఇందులో గది అద్దె రూ.22,400, పనిమనిషికి, వంట సరుకులకు రూ.2,800, విద్యుత్, ఇతర బిల్లులు రూ.2,000 వంటి స్థిరమైన ఖర్చులు ఉన్నాయి. ఇతర ఖర్చుల విషయానికి వస్తే.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం వారానికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.8,000, ఇంటికి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్లు రూ.16,000, స్నేహితుల కోసం తీసుకెళ్లిన గిఫ్ట్ ల ఖరీదు రూ.20,000 అని పూజ తెలిపారు.

ఫిబ్రవరిలోనే ఖర్చు ఎందుకు పెరిగిందంటే..

అయితే ప్రతి నెలా ఇంత ఖర్చు కాదని, ఫిబ్రవరిలో కొన్ని అదనపు ఖర్చులు తోడయ్యాయని ఆమె క్లారిటీ ఇచ్చారు. కొత్త ఇంటికి మారడం వల్ల మూవర్స్ అండ్ ప్యాకర్స్‌కు రూ.3,000, ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.66,600 చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇవన్నీ కలిపి మొత్తం రూ.1.43 లక్షలకు చేరిందని ఆమె వివరించారు.

నెవర్ అగైన్..!

‘‘మొత్తం ఖర్చు లెక్కించిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయ్యింది.. మళ్లీ ఇలాంటి లెక్కలు ఎప్పుడూ వేయకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ ఆమె తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరులో అన్నీ ఖరీదైనవేనని, వచ్చే నెలలో ఈ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ వివరాలతో పూజ తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఒక మద్యతరగతి వ్యక్తి ఏడాది ఆదాయం, బెంగళూరు టెక్కీకి ఒక్క నెల ఖర్చులకు సమానమా?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Pooja Narula
Google
Bangalore
software engineer
cost of living
salary
expenses
India
Silicon Valley
tech

More Telugu News