- ఆఫీసు దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్
- 'ఝలా వాలా' పాటకు అదరగొట్టిన ఓషీన్ పాండ్యా
- ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్లకు చేరువలో వ్యూస్
- ఆమె డ్యాన్స్, స్మైల్‌కు నెటిజన్లు ఫిదా
- ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో వైరల్
ఆఫీసులో జరిగే పండుగ వేడుకల్లో సరదాగా చేసే పనులు ఒక్కోసారి ఊహించని గుర్తింపును తెచ్చిపెడతాయి. చండీగఢ్‌కు చెందిన ఓషీన్ పాండ్యా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన ఆఫీసులో జరిగిన దీపావళి పార్టీలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్ల (20 మిలియన్లు) వ్యూస్ రావడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. ఓషీన్ పాండ్యా తన ఆఫీసు దీపావళి వేడుకల్లో భాగంగా 2012లో వచ్చిన 'ఇషక్‌జాదే' సినిమాలోని 'ఝల్లా వల్లా' పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. నీలం, ఆకుపచ్చ రంగు సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె వేసిన స్టెప్పులకు సహోద్యోగులు కేరింతలతో ప్రోత్సహించారు. ఈ సరదా క్షణాలను వీడియో తీసి.. "ఆఫీస్ దీపావళి పార్టీలో ఒక డ్యాన్స్ అయితే చేయాలి కదా" అనే క్యాప్షన్‌తో ఓషీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, ముఖంలో చిరునవ్వు, పండుగ ఉత్సాహం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'ఆమె ఆఫీస్ క్రష్‌గా మారిపోయింది' అంటూ చాలామంది కామెంట్లు చేశారు. లక్షల సంఖ్యలో లైకులు, ప్రశంసలతో ఈ వీడియో ఆఫీసుల్లో జరిగే చిన్న చిన్న సంతోషకరమైన క్షణాలకు ప్రతీకగా నిలిచింది.