ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం పెదకాకానిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సాధారణ పౌరుడిలాగే క్యూలో నిల్చొని తన వంతు వచ్చినప్పుడు ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న కొద్దిమంది అభిమానులు, స్థానికులతో ఆయన మాట్లాడారు.

ప్రతి ఎన్నికల్లోనూ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అందులో భాగంగానే బోయపాటి శ్రీను కూడా తన స్వస్థలంలో ఓటు వేసి తన పౌర బాధ్యతను నెరవేర్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.