టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు నియామకం

J Syamala Rao appointed as TTD EO
  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తొలగింపు
  • సెలవుపై వెళ్లిన ధర్మారెడ్డి
  • టీటీడీ నూతన ఈవోగా జె.శ్యామలరావు... ఉత్తర్వులు జారీ
ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే, పలు కీలక పదవుల్లో ఉన్నవారు తప్పుకోవడమో, లేక కొత్త ప్రభుత్వమే వారిని సాగనంపడమో జరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలు పర్యవేక్షించే టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నుంచే ప్రక్షాళన చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

ఇప్పటికే, టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో టీటీడీ కొత్త ఈవోగా జె.శ్యామలరావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తొలగింపునకు గురైన ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. 

శ్యామలరావు ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Go Back to Shorts
J Syamala Rao
TTD EO
Dharma Reddy
Tirumala
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News