కేసులు ఎత్తివేయకుంటే..: కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక
- ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని సీజేపీ ఆరోపణ
- ఢిల్లీ వెలుపల నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్
- అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలన్న కాక్రోచ్ జనతా పార్టీ
- హామీలు అమలు చేయకుంటే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరిక
నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల అక్రమాలపై తాము చేపట్టిన ఆందోళన విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం ఆరోపించింది. ఢిల్లీ వెలుపల నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులు, నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. "బీజేపీ లేదా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో నిరసనకారులపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలోనే మేము మా దేశవ్యాప్త ఆందోళనను విరమించుకున్నాం. అయితే, ప్రస్తుతం వస్తున్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తక్షణమే జోక్యం చోసుకుని, అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేసేలా చూడాలని కోరారు. మంగళవారం లోగా లిఖితపూర్వక హామీ ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఒకవేళ హామీలను గౌరవించకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల అనంతరం సీజేపీ తన 36 రోజుల సుదీర్ఘ ఆందోళనను శనివారం విరమించుకున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వ హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఢిల్లీలో నమోదైన సుమారు 15 ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణపై ఉన్నతాధికారుల నుంచి అధికారిక ఆదేశాలు వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు, బీహార్‌లోని సివాన్‌లో నిరసనకారులపై ఏకే-47 ఎక్కుపెట్టిన ఒక కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.