సీఎం చంద్రబాబు అనుమతిస్తే రైతులతో పాటు నేను కూడా కలుస్తా: వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi says I will meet CM Chandrababu Naidu if permitted
  • చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ
  • సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వంశీ
  • సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతి
కృష్ణా జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గన్నవరం వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రైతుల సమస్యలను విన్నవించుకున్నామని తెలిపారు. అప్పుడు కూడా ఆయన సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. తనను కలిసేందుకు ముఖ్యమంత్రికి ఇబ్బంది అయితే రైతులు మాత్రమే వచ్చి సమస్యను వివరిస్తారని చెప్పారు. సీఎం అనుమతి ఇస్తే తాను కూడా కలుస్తానని వల్లభనేని పేర్కొన్నారు.

కాగా కృష్ణా జిల్లాపై ఎల్ నినో ఎఫెక్ట్ పడింది. జులై చివరి వారానికి వచ్చినా ఆశించిన వర్షాలు లేక సాగుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గన్నవరం పరిసరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలకు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వల్లభనేని వంశీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 
Advertisement
Vallabhaneni Vamsi
Chandrababu Naidu
Krishna district farmers
Gannavaram agriculture issues
Vallabhaneni Vamsi letter
Andhra Pradesh water scarcity

More Telugu News