పని గంటల రికార్డుల్లో లోపాలు.. ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో రూ.2 కోట్ల జరిమానా
- ఫ్రాన్స్ కార్మిక శాఖ చర్యలు
- టైమ్-ట్రాకింగ్ వ్యవస్థపై అభ్యంతరాలు
- పని గంటల రికార్డుల్లో లోపాల గుర్తింపు
- స్థానిక కార్మిక చట్టాల ఉల్లంఘనగా నిర్ధారణ
- ప్రభావం పెద్దగా ఉండదన్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో భారీ జరిమానా పడింది. ఉద్యోగుల పని గంటలను నమోదు చేసే వ్యవస్థ స్థానిక కార్మిక చట్టాలకు అనుగుణంగా లేదని గుర్తించిన ఫ్రెంచ్ కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సుమారు 1.75 లక్షల యూరోల (దాదాపు రూ.2 కోట్లు) జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడించింది.
ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటలు, అదనపు పని సమయం, తప్పనిసరి విశ్రాంతి సమయాలను కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ రికార్డులు విశ్వసనీయంగా ఉండటంతో పాటు అవసరమైనప్పుడు పరిశీలించగలిగేలా ఉండాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. అయితే ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైమ్-ట్రాకింగ్ వ్యవస్థ ఈ ప్రమాణాలను పూర్తిగా పాటించలేదని ఫ్రెంచ్ కార్మిక శాఖ తేల్చింది. ముఖ్యంగా రికార్డుల విశ్వసనీయత, ఆడిట్‌కు అనువుగా ఉండటం, కొంతమంది ఉద్యోగుల పని గంటల పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ జరిమానా వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితి లేదా వ్యాపార కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. అధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.