కేంద్రం లెక్కల్లో ఏపీ ఘనత.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అద్భుతమైన ప్రగతి
- 2025-26లో 3,865 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి
- గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు అధికం
- లోక్‌సభలో వివరాలను వెల్లడించిన కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ
- ప్రభుత్వ విధానాలతోనే ఈ అపూర్వమైన వృద్ధి సాధ్యమైందని వెల్లడి
- 2029 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏకంగా 3,865.63 మెగావాట్ల మేర కొత్త ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ విషయాన్ని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్ల పెరుగుదల కావడం గమనార్హం.
తమిళనాడుకు చెందిన ఎంపీ డాక్టర్ ఎం.కె. విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను పార్లమెంటు ముందు ఉంచింది. ఈ లెక్కల ప్రకారం.. 2024-25లో ఏపీలో 1,085.15 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జతకాగా, 2025-26లో అది అనూహ్యంగా 3,865.63 మెగావాట్లకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదైందని, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన గమ్యస్థానాల్లో ఒకటిగా ఏపీ నిలిచిందని అధికారిక ప్రకటన పేర్కొంది.
గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. 2021-22లో 125.42 మెగావాట్లు, 2022-23లో 148.62 మెగావాట్లు, 2023-24లో కేవలం 59.15 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే పెరిగింది. అయితే, 2024-25 నుంచి ఊపందుకుని 1 గిగావాట్ (1000 మెగావాట్లు) దాటిన వృద్ధి, తాజాగా దాదాపు 3.9 గిగావాట్లకు చేరడం రాష్ట్రంలో ఈ రంగం పుంజుకుందనడానికి నిదర్శనం.
పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, మెరుగైన అమలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టడం వంటివి ఈ వృద్ధికి కీలక కారణాలని అధికారిక ప్రకటన వివరించింది.
ఈ ఏడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ' అమలును కూడా వేగవంతం చేసింది. ఈ విధానం కింద 2029 నాటికి పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ నిల్వ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్, తయారీ రంగాల్లో ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా శిలాజయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని దాటిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 50 శాతం లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించిందని, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజయేతర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించే దిశగా దేశం పయనిస్తోందని పేర్కొంది. ఈ జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ తన వంతు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో భారీ వృద్ధి ద్వారా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సుస్థిర ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.