ఆయన అరవడం, ఆయాసపడడం చూశాను కానీ... సాయపడడం ఎక్కడా చూడలేదు: యాంకర్ శ్యామల
- ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన యాంకర్ శ్యామల
- పిఠాపురంలో గెలిచేది వంగా గీత అని ధీమా
- రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదని విమర్శలు
- సర్వేలు ఎప్పుడూ రిజల్ట్స్ కాబోవని వ్యాఖ్యలు
తాను అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే చెబుతానని, పిఠాపురంలో గెలిచేది వంగా గీత అని స్పష్టం చేశారు. 15 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయన్న ప్రశ్నకు శ్యామల బదులిస్తూ... సర్వేలు ఎప్పుడూ రిజల్ట్స్ కాబోవని, ఎవరు విజేత అన్నది రేపు జూన్ 4న తెలుస్తుందని అన్నారు.
"ఒక్కటే మాట చెబుతా... రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు. రాజకీయాలు అంటే సాయం చేయడం అని నేను నమ్ముతా. రాజకీయాలకు నేనిచ్చే నిర్వచనం ఇదీ!
ఇప్పటివరకు ఆయన ఆవేశపడడం చూశాను, ఆయాసపడడం చూశాను. పాపం... వేదికలపై ఎంత అరుస్తారండీ ఆయన! ఆయనను ఈ విధంగా చూశానే తప్ప... సాయం చేయడం ఎక్కడా చూడలేదు" అంటూ శ్యామల పేర్కొన్నారు.