రిటైర్డ్‌హర్ట్ తర్వాత కూడా రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్‌శర్మను ఎలా అనుమతించారు?
- ఆఫ్ఘనిస్థాన్‌పై రెండో సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్
- మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
- రోహిత్ నిర్ణయం సరైందేనంటున్న క్రికెట్ లా
ఇదే విషయాన్ని అంపైర్ల వద్ద ఆఫ్ఘనిస్థాన్ లేవనెత్తింది. ఓవర్ క్రితం రిటైర్డ్‌హర్ట్ అయిన బ్యాటర్‌ను తర్వాతి ఓవర్‌లోనే మళ్లీ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. అయితే, ఈ విషయంలో రోహిత్ నిర్ణయం సరైనదే. ఎందుకంటే అతడు తొలి ఓవర్‌లో అవుట్ కాలేదు. రిటైర్డ్‌హర్ట్‌గా మాత్రమే వెనుదిరిగాడు. కాబట్టి అతడు మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అర్హుడేనని క్రికెట్ లా చెబుతోంది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ వీరవిజృంభణ చేశాడు. అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా, ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.