టీమిండియా - పాకిస్థాన్ మధ్య నేడే హైఓల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులో వీరు ఉండే అవకాశం!
- ఆసియాకప్ లో ఇండియా - పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్
- శ్రీలంకలోని పల్లెకెలేలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- శ్రేయస్ అయ్యర్, బుమ్రాలకు చోటు లభించే అవకాశం
క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టులో ఈ ఆటగాళ్లు ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు తుది జట్టులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.