పాక్ చరిత్రలో తొలిసారిగా రూ.300 మార్కు దాటిన ఇంధన ధరలు
- అధిక విద్యుత్ చార్జీలతో అల్లాడుతున్న పాక్ ప్రజలపై ఇంధన ధరల భారం
- గురువారం ఇంధన చార్జీలు పెంచిన ఆపద్ధర్మ ప్రభుత్వం
- పెట్రోల్ లీటరకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంపు
- ఫలితంగా లీటర్ పెట్రోల్ రూ.305.36కు, డీజిల్ ధర రూ.311.84కు చేరిన వైనం
ఇటీవల కాలంలో పాక్ ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేక నిరసనల బాట పట్టారు. పలు ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, విద్యుత్ బిల్లుల దహనాలను చేపట్టారు. డిస్కమ్ సంస్థల అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇక ప్రజలపై ధారాభారాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఊరట కల్పించట్లేదు.