తన సోదరిని కాపాడాలని ట్వీట్ చేసిన ఏపీ యువకుడు... వెంటనే స్పందించిన కేటీఆర్!

KTR Help to Corona Patient in AP
  • విజయవాడ ఆసుపత్రిలో యువతికి చికిత్స
  • రెమిడెసివిర్ ఇంజక్షన్ కావాలని ట్వీట్
  • మేకపాటితో మాట్లాడిన కేటీఆర్
తన సోదరికి కరోనా సోకి బాధపడుతోందని, ఆసుపత్రిలో రెమిడెసివిర్ ఔషదం లభించడం లేదని, వాపోతూ, తమకు సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు, తెలంగాణ యువనేత, మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన కేటీఆర్, వెంటనే స్పందించి, ఆమెకు అవసరమైన రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందించేలా చూశారు. అంతకుముందు గుప్తా అనే ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ, విజయవాడలోని ఓ హాస్పిటల్ లో తన సోదరి కరోనా చికిత్స పొందుతోందని, ఆమెకు ఇంజక్షన్ల అవసరం ఎంతైనా ఉందని చెబుతూ, సాయం చేయాలని కోరాడు.

ఆ వెంటనే 'తప్పకుండా' అంటూ సమాధానం ఇచ్చిన కేటీఆర్, తన మిత్రుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆపై అదే విషయాన్ని గుప్తాకు వెల్లడించారు. కేటీఆర్ ఫోన్ తరువాత గౌతం రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెకు రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందించారు. తన సోదరికి ఇంజక్షన్ అందిన తరువాత మంత్రులకు గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.

Go Back to Shorts
KTR
Mekapati Goutham Reddy
Andhra Pradesh
Twitter

More Telugu News