పాక్ విమానాలకు తన గగనతలాన్ని నిషేధించిన ఒమన్
- పీఐఏ పైలట్లలోని మూడో వంతు మంది దగ్గర నకిలీ సర్టిఫికెట్లు
- ఆందోళన వ్యక్తం చేసిన ఒమన్ పౌర విమానయాన శాఖ
- తమ గగనతలం వాడుకోవద్దంటూ పాక్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు
ఈ నేపథ్యంలో ఒమన్ పౌరవిమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత పీఐఏలోని పైలట్లలో దాదాపు మూడోవంతు మంది వద్ద ఉన్న డిగ్రీలు నకిలీవని తేలడం అప్పట్లో సంచలనమైంది. పీఐఏతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయమై ఒమన్ పౌరవిమానయాన శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా, ఆ దేశ విమానాలపై నిషేధం విధించింది.