నా నిర్ణయమే ఫైనల్.. వ్యతిరేకిస్తే క్రమశిక్షణా చర్యలు: టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
- ఎంపిక కాబడని వారికి భవిష్యత్తులో అవకాశం
- టికెట్ ఇవ్వని కారణం చెప్పాలంటే చెబుతా
- నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు
ఎంపిక కాబడని వారికి భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని, వారికి టికెట్ ఇవ్వని కారణం తెలుసుకోవాలని ఉంటే, తాను రికార్డులను ఇస్తానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా నేతల పనితీరు, వారిపై ప్రజల్లో అభిప్రాయం, వారి సామర్థ్యం తదితరాలన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. పని చేస్తున్న వారితో పాటు సామాజిక న్యాయపరంగానూ తాను ఆలోచించానని, ఓ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ప్రజాభిప్రాయం, కార్యకర్తల మనోగతం తెలుసుకున్నానని చెప్పారు.
వైసీపీలో చింతలపూడి అభ్యర్థిని పలుమార్లు మారుస్తున్నారని, తొలుత రూ. 3 కోట్లు ఇస్తానని వచ్చిన వ్యక్తి పేరు చెప్పి, ఆపై అంతకన్నా ఎక్కువ ఇస్తానంటూ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.