‘ఇండియా ఛాంపియన్స్’ క్షమాపణ చెప్పాలట.. డబ్ల్యూసీఎల్ నుంచి పాక్ జట్టు ఔట్!
- గతేడాది పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన భారత్
- అందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని పాక్ మెలిక
- పాక్ డిమాండ్‌ను తిరస్కరించిన డబ్ల్యూసీఎల్
- భారత ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గని టీమిండియా ఛాంపియన్స్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించిన భారత మాజీ క్రికెటర్ల నిర్ణయంపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. గత సీజన్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా భారత్ తీసుకున్న నిర్ణయంపై క్షమాపణ చెప్పాలని పాకిస్థాన్ ఇప్పుడు డిమాండ్ చేసినట్లు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ కథనం పేర్కొంది.
ఎన్డీటీవీ కథనం ప్రకారం... ఈ డిమాండ్‌ను ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్రస్తుత టోర్నీ నుంచి వైదొలిగింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. భారత జట్టు పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయంలో భారత్ వెనక్కి తగ్గలేదు. దీంతో గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ రద్దయింది.
సెమీఫైనల్లోనూ భారత్ ఇదే వైఖరిని కొనసాగించింది. పాక్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగకపోవడంతో పాకిస్థాన్ వాకోవర్‌తో ఫైనల్‌కు చేరింది. భారత జట్టులో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప వంటి మాజీ ఆటగాళ్లు ఉన్నారు.
ఈసారి టోర్నీలో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు పీసీబీ ఎన్‌ఓసీలు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే గత సీజన్‌లో తీసుకున్న నిర్ణయంపై భారత్ నుంచి లిఖితపూర్వక క్షమాపణ కోరింది. అంతేకాదు.. భారత ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనకపోయినా అభ్యంతరం లేదని నిర్వాహకులు హామీ ఇవ్వాలని కూడా కోరింది.
అయితే ఈ డిమాండ్లను డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు అంగీకరించలేదు. దీంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీనిపై డబ్ల్యూసీఎల్ మాత్రం ‘అనుకోని పరిస్థితుల కారణంగా’ పాక్ జట్టు వైదొలిగినట్లు ప్రకటించింది.
ఏంటీ ‘డబ్ల్యూసీఎల్’?
‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) అనేది మాజీ అంతర్జాతీయ క్రికెటర్లతో నిర్వహించే టీ20 లీగ్. ఇందులో వివిధ దేశాలకు చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఆయా దేశాల పేర్లతో జట్లుగా బరిలోకి దిగుతారు. భారత్ తరఫున యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లు ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మరోసారి మైదానంలో అభిమానులను అలరించే అవకాశం కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం.