ఇండియాలో ‘ఐఏఎస్ సింగం’.. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్‌లో ‘రాక్‌స్టార్’!
- తూకారాం ముండేకు న్యూయార్క్ టైమ్స్‌లో అరుదైన గుర్తింపు
- ఫ్రంట్ పేజీలో ‘రాక్‌స్టార్’గా అభివర్ణన
- భారత్‌లో ఇప్పటికే ముండేకు ప్రత్యేక గుర్తింపు
- ‘ఐఏఎస్ సింగం’గా ముండేకు పేరు
- రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు, ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై చర్యలు
కఠిన చర్యలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తూకారాం ముండే పేరు ఇప్పుడు అంతర్జాతీయ మీడియా వేదికపై మార్మోగింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా పరిశుభ్రత నిబంధనలు పాటించని రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్లపై కొరడా ఝళిపిస్తున్న ముండేను ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఏకంగా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించింది. ఆ పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఆయనపై ప్రత్యేక కథనం ప్రచురించడం విశేషం.
న్యూయార్క్ టైమ్స్ “ఇన్ ఇండియా, ఏ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఈజ్ ఏ రాక్‌స్టార్” అనే శీర్షికతో ముండేపై కథనం ప్రచురించింది. “డైనర్స్ రెవర్ హిమ్ అండ్ ఓనర్స్ ఫియర్ హిమ్” అంటూ ఆయనకు వినియోగదారుల్లో ఉన్న అభిమానాన్ని, రెస్టారెంట్ యజమానుల్లో ఉన్న భయాన్ని ప్రస్తావించింది. వెబ్ కథనంలో ఆయన్ను ‘ఫుడ్ సేఫ్టీ సెలబ్రిటీ’గా పేర్కొంది.
ఆకస్మిక తనిఖీలతో ముండే ఇప్పటికే దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెస్టారెంట్లు, ఫుడ్ షాపులు, గోదాములు, క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ‘ఐఏఎస్ సింగం’ అనే పేరు కూడా వచ్చింది.
‘డొమినోస్’, ‘పిజ్జా హట్’ ఔట్‌లెట్లలో తనిఖీల సందర్భంగా వంటగదుల్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు గుర్తించడంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. ముంబయిలోని కొన్ని ప్రముఖ పాతకాలపు ఫుడ్ బిజినెస్‌ల లైసెన్సులపైనా తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది.
క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జెప్టోకు చెందిన డార్క్ స్టోర్లలోనూ తనిఖీలు జరిగాయి. అక్కడ బల్లులు, బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి.
రెస్టారెంట్ యజమానులపై చర్యలు తీసుకుంటున్న ముండే.. పరిశుభ్రమైన ఆహారం కోరుకునే వినియోగదారుల్లో మాత్రం ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ గుర్తింపే అంతర్జాతీయ స్థాయికి చేరింది. భారత్‌లో ‘ఐఏఎస్ సింగం’గా పేరొందిన ఆయనను న్యూయార్క్ టైమ్స్ ‘రాక్‌స్టార్’గా అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది.