15 ఏళ్ల వైభవ్‌ను స్టార్‌గా తీర్చిదిద్దుతున్న టీమిండియా.. మోర్కెల్ చెప్పిన మాస్టర్ ప్లాన్!
- వైభవ్‌ను సీనియర్లతో కలిసి నేర్చుకునేలా చేస్తున్న టీమిండియా
- 15 ఏళ్ల యువ ఓపెనర్‌కు మోర్కెల్ సూచనలు
- గేమ్ టైమ్ లేకపోయినా నేర్చుకోవచ్చన్న కోచ్
- సీనియర్ల ఆటతీరును గమనించాలని సూచన
- ప్రతి ప్రాక్టీస్ తర్వాత ఏం నేర్చుకున్నావని ప్రశ్న
టీమిండియాలోకి వచ్చిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పెద్ద ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సీనియర్ ఆటగాళ్ల మధ్య ఉండటం, వాళ్లను గమనించడం, ప్రశ్నలు అడగడం ద్వారా 15 ఏళ్ల వైభవ్ ఎంతో నేర్చుకోగలడని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. వెస్టిండీస్‌తో మంగళవారం ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్‌కు ముందు అతను ఈ వ్యాఖ్యలు చేశారు.
వైభవ్‌కు తుది జట్టులో అవకాశం వచ్చినా.. రాకపోయినా అతడి ఎదుగుదల ఆగదని మోర్కెల్ అన్నారు. మ్యాచ్ ఆడకపోయినా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లతో గడపడం, వాళ్లు ప్రాక్టీస్‌కు ఎలా సిద్ధమవుతున్నారు? ఇన్నింగ్స్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు? పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా స్పందిస్తున్నారు? అన్నది గమనించడం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
“ప్రాక్టీస్‌లో ఈ ఆటగాడు ఏం చేస్తున్నాడో చూడు. అతడు తొలి 15 బంతులను ఎలా ఎదుర్కొంటున్నాడు? పిచ్ నుంచి సహకారం లభిస్తే ఎలా ప్లాన్ చేస్తున్నాడు? అని యువ ఆటగాళ్లను ఆలోచించేలా చేస్తాను” అని మోర్కెల్ తెలిపాడు.
ప్రతి ప్రాక్టీస్ సెషన్ తర్వాత వైభవ్ ఏం నేర్చుకున్నాడో అడుగుతానని చెప్పాడు. “నేను ఫాస్ట్ బౌలర్‌ను. బ్యాటింగ్ గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ బస్సులో అతడిని ‘ఈ రోజు ఏం నేర్చుకున్నావు? ఆ ఆటగాడి బ్యాటింగ్‌లో ఏం గమనించావు?’ అని అడుగుతాను. ఇలా అడగడం వల్ల అతడు ఆలోచిస్తాడు. తర్వాత నెట్స్‌లోకి వచ్చినప్పుడు ఆ విషయాలను గమనించి తన ఆటకు తగ్గట్టుగా మార్చుకుంటాడు” అని వివరించాడు.
ఇక భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లక్నోలోని ఏకానా స్టేడియంలో జరగనుంది. ఆసియా క్రీడల నుంచి తిరిగొచ్చిన ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రయాణ అలసటను పరిశీలించిన తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తామని మోర్కెల్ తెలిపాడు.
గాయంతో కొంతకాలం దూరమైన మయాంక్ యాదవ్ తిరిగి జట్టులోకి రావడం కూడా భారత్‌కు కీలకమేనన్నారు. అతడి వేగం ప్రత్యేక ఆయుధమని చెప్పాడు. నెట్ బౌలర్‌గా మొదలై ఇప్పుడు భారత్ తరఫున ఆడే స్థాయికి చేరుకున్న ప్రిన్స్ యాదవ్ కష్టపడిన తీరును మోర్కెల్ ప్రశంసించాడు.