గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా లక్ష్యం అదే.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- గంగూలీ జట్టు లక్ష్యం విదేశాల్లో ఎక్కువ విజయాలేనన్న సెహ్వాగ్
- అప్పటి జట్టు ఆ లక్ష్యాన్ని సాధించిందని వ్యాఖ్య
- ప్రస్తుత టీమిండియా ఆటతీరుపై మాట్లాడలేనన్న సెహ్వాగ్
- మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టే తన ఆట మార్చేవాడినని వివరణ
- అవసరమైతే రక్షణాత్మకంగా ఆడానని వెల్లడి
సౌరవ్ గంగూలీ నాయకత్వంలో టీమిండియా ఎలా ఆడేదో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. విదేశీ గడ్డపై వీలైనన్ని మ్యాచ్‌లు గెలవాలన్నదే అప్పటి జట్టు ప్రధాన లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుత టీమిండియా ఆటతీరుపై మాత్రం తాను మాట్లాడలేనని స్పష్టం చేశాడు.
‘రైజ్ అండ్ ఫాల్’ రెండో సీజన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సెహ్వాగ్ ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా అప్పటి జట్టు ఆలోచనా విధానాన్ని వివరించాడు. ‘‘నేను దాదా నాయకత్వంలోని జట్టులో ఉన్నాను. కాబట్టి ఆ జట్టు ఆలోచనా విధానం గురించి చెప్పగలను. ప్రస్తుత జట్టులో నేను లేను. వారి ఆటతీరు గురించి నాకు పూర్తిగా తెలియదు. అందుకే దానిపై మాట్లాడలేను’’ అని సెహ్వాగ్ అన్నాడు.
గంగూలీ నాయకత్వంలో తమ ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ మ్యాచ్ లలో ఎక్కువగా గెలవడమేనని చెప్పాడు. విదేశీ గడ్డపై విజయాలు సాధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపాడు. ఆ లక్ష్యాన్ని జట్టు సాధించిందని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
తాను ఎప్పుడూ దూకుడుగా ఆడేవాడిని కాదని కూడా సెహ్వాగ్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తన ఆటతీరును మార్చుకునేవాడినని తెలిపాడు. అవసరమైనప్పుడు రక్షణాత్మకంగా కూడా ఆడానని చెప్పాడు.
సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా నిలిచింది. ఇద్దరూ కలిసి టీమిండియా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
‘రైజ్ అండ్ ఫాల్’ రెండో సీజన్‌కు సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్‌లో ఈ బాధ్యతలు నిర్వహించిన అశ్నీర్ గ్రోవర్ స్థానంలో అతడు వచ్చాడు. ఈ రియాలిటీ షోలో 15 మంది కంటెస్టెంట్లు 42 రోజుల పాటు పోటీపడతారు. అధికారాన్ని దక్కించుకోవడం, వ్యూహాలు, పొత్తులు ఈ ఆటలో కీలకంగా ఉంటాయి. ఈ షో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం అవుతోంది.