టెన్నిస్ వదిలి రియల్ ఎస్టేట్ వైపు.. 500 డాలర్లతో వచ్చి రూ.100 కోట్ల ఆస్తులు సంపాదించాడు!
- డొమినికన్ మాజీ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రెస్ బెర్నాల్ స్ఫూర్తిదాయక గాధ
- 500 డాలర్లతో అమెరికా వచ్చి 12 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం
- కనెక్టికట్‌లో 60కి పైగా రెంటల్ యూనిట్లకు యజమాని
- ఫ్లిప్పింగ్, స్టూడెంట్ రెంటల్స్‌తో విజయవంతమైన వ్యాపార వ్యూహం
డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రెస్ బెర్నాల్ కష్టపడి పనిచేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. కేవలం 500 డాలర్లతో (సుమారు రూ. 42,000) అమెరికాలో అడుగుపెట్టిన అతడు, నేడు 12 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 100 కోట్లు) పైగా విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
టెన్నిస్‌లో రాణించాలనే లక్ష్యంతో అమెరికాకు వచ్చిన బెర్నాల్, రెండేళ్ల పాటు ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడాడు. ఆ తర్వాత టెన్నిస్ కోచ్‌గా మారి వారానికి 50 నుంచి 60 గంటలకు పైగా శ్రమించాడు. అయితే, కేవలం సమయాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించడం కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని నిర్ణయించుకున్నాడు. సొంత దేశం డొమినికన్ రిపబ్లిక్ లో బిల్డర్ గా రాణిస్తున్న తన గాడ్‌ఫాదర్ నుంచి స్ఫూర్తి పొంది రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించాడు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత 2016లో తన మొదటి ఆస్తిని కొనుగోలు చేశాడు.
ప్రస్తుతం అతడికి కనెక్టికట్ రాష్ట్రంలో 60కి పైగా రెంట్ కు ఇచ్చే ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో మల్టీఫ్యామిలీ ప్రాపర్టీలు, డ్యూప్లెక్స్‌లు, సింగిల్-ఫ్యామిలీ ఇళ్లు ఉన్నాయి. ముఖ్యంగా, మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలకు సమీపంలో ఉన్న స్టూడెంట్ రెంటల్స్‌పై అతడు ప్రత్యేకంగా దృష్టి సారించాడు. విద్యార్థుల తల్లిదండ్రుల హామీతో ఈ ప్రాపర్టీలను అద్దెకిస్తూ స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. వీటితో పాటు, ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన సెక్షన్ 8 ప్రోగ్రామ్ కింద 22 యూనిట్లను నిర్వహిస్తున్నాడు.
దీర్ఘకాలిక అద్దెలతో పాటు ప్రాపర్టీ ఫ్లిప్పింగ్‌లోనూ (పాత ఇళ్లను కొని, బాగు చేసి అమ్మడం) బెర్నాల్ చురుగ్గా ఉన్నాడు. 2024-25 మధ్య కాలంలోనే 50కి పైగా ప్రాపర్టీలను విజయవంతంగా ఫ్లిప్ చేశాడు. తన వ్యాపార కార్యకలాపాల కోసం దాదాపు 12 మంది కాంట్రాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీరే మరమ్మతులు, పెయింటింగ్, ప్లంబింగ్ వంటి పనులు చూసుకుంటాడు.
తన వ్యాపారంలో ఎప్పుడూ ఆచితూచి వ్యవహరించే బెర్నాల్, భద్రత, నిర్మాణపరమైన అంశాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. పాత ఆస్తులను అమ్మేయడానికి కూడా వెనుకాడడు. తన ప్రయాణాన్ని, అనుభవాలను వివరిస్తూ అతడు 'బోర్న్ టు రిటైర్ యంగ్' అనే పుస్తకాన్ని కూడా రచించాడు. ఒక వలసదారుడిగా వచ్చి, కఠోర శ్రమ, తెలివైన వ్యూహాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన బెర్నాల్ కథ నేటి యువతకు ఎంతో ఆదర్శం.