ఒకే వేదికను పంచుకుని ప్రసంగించనున్న కేటీఆర్, నారా లోకేష్!
- హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్సుకు హాజరుకానున్న కేటీఆర్, లోకేష్
- ఇద్దరూ కలసి పాల్గొంటున్న సదస్సు కావడంతో.. సర్వత్ర ఆసక్తి
- హాజరుకానున్న కమల్, సురేష్ ప్రభు
అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో 'హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్' కూడా ఒకటి. ప్రభుత్వ అధికారులు, వాణిజ్యవేత్తలు, దాతృత్వకారులు, రాజకీయవేత్తలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కాన్ఫరెన్సుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరై, ప్రసంగించారు. ఈసారి కాన్ఫరెన్సుకు కమలహాసన్, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తదితరులు కూడా వెళ్తున్నట్టు సమాచారం.