హిందువుల వల్లే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంటుంది: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- చాలా జిల్లాల్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది
- దేశ సమగ్రతకు ఇది భంగం
- అన్ని మతాలకు కుటుంబ నియంత్రణ అమలు చేయాలి
'ఉత్తర ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ జిల్లాల్లో ముస్లింల సంఖ్య పెరిగిపోతోంది. అది దేశ సమగ్రత, ఏకీకృతానికి భంగం కలిగిస్తుంది' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అలాగే అన్ని మతాల వారికి కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.