రోహింగ్యా ముస్లింల అరాచకం.. 28 మంది హిందువుల ఊచకోత!
- దారుణంగా, అత్యంత క్రూరంగా హతమార్చిన వైనం
- మృతుల్లో మహిళలు, బాలురు
- రఖినేను వీడిన 30 వేల మంది హిందువులు
రోహింగ్యా ముస్లింలు హత్య చేసిన 28 మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అత్యంత దారుణంగా, క్రూరంగా హతమార్చినట్టు ఆర్మీ చీఫ్ వెబ్‌సైట్ పేర్కొంది. అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ) గ్రూప్ వీరిని హతమార్చినట్టు తెలిపింది.
రఖినే జిల్లాలో హింస చెలరేగడంతో 4.30 లక్షల మంది రోహింగ్యాలు మయన్మార్‌ను విడిచిపెట్టారు. మయన్మార్ సైనికులు తమను చంపేస్తున్నారని, గ్రామాలకు గ్రామాలే తగలబెడుతున్నారని ఆరోపిస్తూ వీరంతా బంగ్లాదేశ్‌కు పారిపోయారు. కాగా, రఖినే జిల్లాలోని మొత్తం 30 వేల మంది హిందువులు, బుద్ధులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. రోహింగ్యాలు తమను లక్ష్యంగా చేసుకున్నందుకే తాము పారిపోతున్నట్టు వారు చెప్పడం గమనార్హం. ఇక ఆర్మీ స్వాధీనం చేసుకున్న హిందువుల మృతదేహాల్లో 20 మహిళలవి కాగా, పదేళ్లలోపున్న ఆరుగురు బాలురు కూడా ఉన్నారు.