టీ20 వరల్డ్ కప్: పసికూన ఉగాండాను 58 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘన్
- గయానాలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఉగాండా
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసిన ఆఫ్ఘన్
- 16 ఓవర్లలో 58 పరుగులకు ఉగాండా ఆలౌట్
- 125 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ విజయం
దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఉగాండా జట్టు 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ లెఫ్టార్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ 5 వికెట్లతో ఉగాండా వెన్నువిరిచాడు. నవీనుల్ హక్ 2, కెప్టెన్ రషీద్ ఖాన్ 2, ముజీబ్ 1 వికెట్ తీశారు.
ఉగాండా జట్టులో రాబిన్సన్ ఒబుయా చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు. రియాజత్ అలీ షా 11 పరుగులు చేశారు. వీరిద్దరు మినహా ఆ జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేదు.