బిడ్డలకు దూరమైనందుకు వ్యధ.. త్వరలో పాక్‌ నుంచి వచ్చేయనున్న అంజూ!

Anju who left india for pakistani lover set to return for her children
అంజూ.. ఈ మధ్యకాలంలో భారత్, పాక్ దేశాల్లో మారుమోగిపోయిన పేరిది. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ వివాహిత. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఫేస్‌బుక్‌లో ఓ పాకిస్థానీ వ్యక్తితో అంజూ పరిచయం ప్రేమగా మారి ఆమెను కుటుంబాన్ని కాదనుకుని పాక్ చేరేలా చేసింది. అక్కడ ఆమె తన పేరు మార్చుకుని ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడింది. 

అయితే, వచ్చే నెలలో అంజూ భారత్‌కు తిరిగి వెళ్లిపోతుందని నస్రుల్లా తాజాగా పేర్కొన్నాడు. బిడ్డలకు దూరమైన ఆమె మానసిక వేదనకు గురవుతోందని, పిల్లల్ని కోల్పోతున్నానన్న భావన ఆమెను కుంగదీస్తోందని చెప్పుకొచ్చాడు. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదన్న అతడు, బిడ్డల కోసం ఆమె భారత్‌కు వెళ్లడమే మంచిదని చెప్పుకొచ్చాడు. అయితే, పాకిస్థాన్‌లో వీసా సంబంధిత వ్యవహారాలకు కొంత సమయం పడుతుందని, అవి పూర్తయ్యాక వచ్చే నెలలో ఆమె భారత్‌కు వెళ్లిపోతుందని చెప్పాడు. తనకూ వీసా మంజూరైతే భారత్‌కు వస్తానని చెప్పుకొచ్చాడు. అంజూకు ప్రస్తుతం 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.
Go Back to Shorts
Anju
Madhya Pradesh
Pakistan
India

More Telugu News