పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్
- గాయాలతో జట్టుకు దూరమైన పేసర్లు రవూఫ్, నసీమ్ షా
- జట్టులోకి వచ్చిన షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్
- వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని రెస్ట్ కల్పించామన్న పీసీబీ
ఈ సందర్భంగా పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ... రవూఫ్, నసీమ్ షా ఇద్దరూ తమ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావని, ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని వారికి రెస్ట్ కల్పించామని చెప్పింది. ఆసియా కప్ లో వారిని ఆడించి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. మరోవైపు ఈ నెల 14న శ్రీలంక తదుపరి మ్యాచ్ ఆడనుంది.