ఆసియా కప్ లో దాయాదుల సమరం-2... టాస్ ఓడిన టీమిండియా
- ఆసియా కప్ లో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్
- సూపర్-4 దశలో తలపడుతున్న ఇరు జట్లు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- జట్టులో చేరిన బుమ్రా... శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్
ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు జరిగాయి. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. ఇటీవల తండ్రి కావడంతో స్వదేశం వెళ్లిన బుమ్రా తిరిగి జట్టులో చేరాడు.