పాకిస్థాన్ జట్టు బలంగా ఉందన్న రవిచంద్రన్ అశ్విన్
- బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు నిలదొక్కుకుంటే ప్రమాదకరంగా మారతారని వెల్లడి
- టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్ ఫేవరేట్ అని వ్యాఖ్య
- చివరి మూడు వన్డేలలో పాక్‌పై భారత్ విజయం
టోర్నీలో భాగంగా శనివారం శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇంతకుముందు పాకిస్థాన్‌తో తలపడిన చివరి మూడు వన్డేలలో భారత్ విజయం సాధించింది. అయినప్పటికీ పాకిస్థాన్ బలంగా ఉందని అశ్విన్ చెప్పాడు. అయితే అదంతా పాక్ స్క్వాడ్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు.