Pawan Kalyan: వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan likely arrive Machilipatnam in Varahi vehicle
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.

పవన్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 12న కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, కాపు నేతలు పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. ఈ నెల 13న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పవన్ భేటీ కానున్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్నారు. 

గతంలో పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా, పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం కూడా చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Foundation Day
Machilipatnam
Varahi
Andhra Pradesh

More Telugu News